CM Revanth Reddy: నల్లమల రైతులకు శుభవార్త.. ఉచిత సోలార్ పంపుసెట్లు ఇస్తామని సీఎం హామీ
- ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం
- ‘నల్లమల డిక్లరేషన్’ను ఆవిష్కరించిన ముఖ్య మంత్రి
- గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్’ను సైతం ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం నల్లమల ప్రాంతం గురించి సీఎం ప్రసంగించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని నాటి రోజులను సీఎం గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగిపోతోందన్నారు.
READ MORE: CM Revanth Reddy: రాష్ట్రంలోని ఆ ఐదారుగురు సన్నాసుల గురించి పట్టించుకోను..
Also Read
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ఈ నేపథ్యంలో సీఎం రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక్కడి రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. వందరోజుల్లో సోలార్ విద్యుత్ మోటార్ అందిస్తామని శుభవార్త చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని ప్రపంచానికే ఆదర్శంగా మారుస్తామన్నారు. దిగ్గజ కంపెనీలతో పోటీపడేలా శిల్పారామం దగ్గర మహిళలకు స్టాళ్లు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి భోజనం చేసి వచ్చానని గుర్తు చేశారు. నేడు ప్రతి పేదవాడి ఇంటికీ సన్న బియ్యం అందుతోందని తెలిపారు. ఇప్పటి వరకు రైతుల కోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు.
READ MORE: Kakarla Suresh: అభివృద్ధి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీఠ వేశారు!
“గతంలో వరి వేస్తే ఉరే అని ఆనాడు అన్నారు.. ఆ దొర మాత్రం వందల ఎకరాల్లో వరి వేసుకున్నారు.. మీరు వరి పండిస్తే బోనస్ ఇస్తామని మేము చెప్తున్నాం.. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం.. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఎవరూ తినేవారు కాదు.. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకున్నాం. నిత్యావసరాల ధరలు తగ్గించడంలో మనమే నంబర్ వన్ అని కేంద్రం చెప్పింది.. శాంతి భద్రతల్లో కూడా మనమే నంబర్ వన్‌లోనే ఉన్నాం.. రాష్ట్ర ఆదాయంలో కూడా తెలంగాణ నంబర్ వన్ అని కేంద్రమే చెప్పింది.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేశాం.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IPL 2026 Final: “ఈ సారి ఐపీఎల్ కప్పు గుజరాత్‌దే”.. బలమైన కారణాలను వివరించిన వరల్డ్ కప్ విన్నర్..
-
Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
-
IPL 2026 Final: “గెలిచినా.. ఓడినా జాగ్రత్త”.. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ వార్నింగ్..
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..