CM Revanth Reddy : కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం..
- కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని నేను అధికారులను ఆదేశించా
- ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా సోనియమ్మను ఒప్పించారు
- ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆనాడు ఎన్నికల్లో గెలిచేందుకు కాకా సహకారం తీసుకున్నారు
- అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరు అని, గతంలో ఉన్నవారు కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూశారో.. లేక ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదన్నారు. కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని నేను అధికారులను ఆదేశించా అని, ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా సోనియమ్మను ఒప్పించారన్నారు. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆనాడు ఎన్నికల్లో గెలిచేందుకు కాకా సహకారం తీసుకున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించారని ఆయన మండిపడ్డారు. కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. 80వేల మందికి పైగా నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత కాకాదని, ఆనాడు సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి కాకా అని, జాతీయ స్థాయిలో నెహ్రూ ను చాచా అని పిలిస్తే.. రాష్ట్రంలో గడ్డం వెంకటస్వామిని కాకా అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకుంటారన్నారు.
Jaishankar: ‘నేను వెళ్తున్నాను కానీ…’ పాకిస్థాన్‌కు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి కీలక ప్రకటన
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
అంతేకాకుండా..’జాతీయ కాంగ్రెస్ కార్యాలయానికి తన ఇంటిని ఇచ్చేసిన కాంగ్రెస్ వాది కాకా.. కాకా ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కాకా కుటుంబ సభ్యుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలన్నది పార్టీ ఆలోచన. మూసీ పరివాహక ప్రాంతాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రభుత్వం మిమ్మల్ని అనాథలను చేయదు.. మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుంది.. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు… ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుంది.. ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకు పేదల ముసుగు అడ్డుపెట్టుకునే వారి మాటలు వినొద్దు. ఈ వేదికగా పేదలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. మీ మంచి కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురికావద్దు… మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది.. ఈటెల, కేటీఆర్, హరీష్ కు సూచన చేస్తున్నా.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి.. మా ప్రభుత్వానికి ఎవరిపై కోపం లేదు..
ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా.. నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు.. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి?
Tollywood : టు డే టాలివుడ్ టాప్ – 9 బుల్లెట్ న్యూస్..
కాకా స్పూర్తితో పేదలకు మెరుగైన వసతులు కల్పిద్దాం.. కేసీఆర్, కేటీఆర్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ లో కొంత భూమిని పేదలకు దానం చేయండి… మీరు ఫామ్ హౌజుల్లో జమీందారుల్లా బతుకుతారు… పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? అవసరమైతే మలక్ పేట్ రేస్ కోర్టును, అంబర్ పేట్ పోలీస్ ఆకాడమీని హైదరాబాద్ బయటకు తరలించి పేదలకు ఇండ్లు కట్టిద్దాం.. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి.. మీ ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి.. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం రూ.11వేల కోట్లు.. 8నెలల్లో మేం రూ.18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం.. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్ ను కలవండి.. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు…. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..