CM Revanth Reddy: రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్లారు. హైదరాబాద్లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు అందిస్తూ వెల్కమ్ చెప్పారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు సీఎం రంజాబ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రంజాన్ పర్వదినం లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Read Also: Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా దేనికైనా సిద్ధం.. కోమటిరెడ్డి సవాల్
ఈ మేరకు ఒక ప్రకటనలో ముస్లింలకు ముఖ్యమంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని వెల్లడించారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ ప్రతీక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.