CM Revanth Reddy : పెద్దన్నగా మేము భావించాం.. మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు
- వివక్ష లేకుండా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని అడిగామన్న సీఎం రేవంత్
- వికసిత్ భారత్ బడ్జెట్ లో ఏం లేదని మండిపాటు
- బడ్జెట్‌లో తెలంగాణ అనే పదం నిషేధించారని ఆగ్రహం
- తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తప్పుపట్టిన మోడీ.. ఇప్పుడు బడ్జెట్ చూస్తే.. ఎంత కక్ష ఉందో అర్థం అవుతుందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్‌పై సీఎ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు కక్షపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తూన్నారన్నారు. 18 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులను ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరచిన పార్లమెంటు ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు ఈ పది సంవత్సరాలలో గత ప్రభుత్వం తో జరిగిన నష్టం నుండి క్పడటానికి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుద చేయాలి అని చెప్పి మేము ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారం అయిపోయాక.. వివక్ష లేకుండా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి అని ప్రధానిని అడిగామని, ఇప్పటి బడ్జెట్ లో సహకరించాలి అని అడిగామని ఆయన వెల్లడించారు. బేషజాలకు పోకుండా వెళ్లి అడిగామని, పెద్దన్నలగా వ్యవహారం చేయండి అని అడిగామన్నారు. కానీ వికసిత్ భారత్ బడ్జెట్ లో ఏం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదం నిషేధించారని, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తప్పుపట్టిన మోడీ.. ఇప్పుడు బడ్జెట్ చూస్తే.. ఎంత కక్ష ఉందో అర్థం అవుతుందన్నారు.
అంతేకాకుండా..’వివక్ష అనుకున్నాం కానీ..కక్ష పూరితంగా వ్యవహరించింది. విభజన చట్టం పేరుతో.. ఏపీ కి రాజధానికి… వెనకబడిన జిల్లాల కోసం నిధులు ఇచ్చారు. ఏపీకి ఎందుకు ఇచ్చారు అని అడగం. కానీ తెలంగాణ కి ఎందుకు ఇవ్వలేదు. మెట్రోకి కానీ.. itir కారిడార్ ప్రస్తావన లేదు. వికసిత భారత్ లో తెలంగాణ లేదనుకున్నట్టి ఉంది మోడీ. కుర్చీ బచావో అన్నట్టు ఉంది. కుర్చీ కాపాడుకునే బడ్జెట్ ఇది. ఇది మోడీకి గౌరవం తెచ్చి పెట్టదు. 8 ఎంపీ సీట్లు ఇచ్చారు తెలంగాణా ప్రజలు. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్ల మోడీ ప్రధాని సీటులో కూర్చున్నారు.
Also Read
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
8 ఎంపీ సీట్లు ఇచ్చిన బీజేపీ.. తెలంగాణ ప్రజలకు ఏం ఇవ్వలేదు. కిషన్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. కేబినెట్ నుండి తప్పుకోవాలి. మౌనంగా ఉండటం సరికాదు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఐఐఎం.. కోచ్ ఫ్యాక్టరీ లేదు. ఐఐఎం దేశం అంతటా ఉంది.. తెలంగాణ కి ఎందుకు ఇవ్వరు, ఐఐఎం ఇవ్వనప్పుడు కిషన్ రెడ్డి కొనసాగడం ఎందుకు. అమరావతి కి వేల కోట్ల ఇస్త అన్న మోడీ.. తెలంగాణ మెట్రోకి.. మూసీకి ఎందుకు ఇవ్వరు. పెద్దన్నగా మేము భావించాం.. మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.
కేవలం క్విట్ ప్రోకో అన్నట్టు ఉంది బడ్జెట్. మీరు మద్దతు ఇవ్వండి..మేము దేశాన్ని దోచి మీ రెండు రాష్ట్రాలకే ఇస్తాం అన్నట్టు ఉంది. మా నిరసన ఉంటుంది..సభలో’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!