మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జి మంత్రులదే అని స్పష్టం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలపై ఇన్‌ఛార్జి మంత్రులు దృష్టిపెట్టడం లేదని.. ఇది కరెక్ట్ కాదన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని సూచించారు. కార్యకర్తలను నారాజ్ చేయకండని పిలుపునిచ్చారు.
READ MORE: Etala Rajender: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందని.. ఎవరికి వారు… నేనే అభ్యర్థిని చెప్పుకోకండన్నారు. పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా చూడాల్సి వస్తుందని.. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. మంత్రి పదవులు కోసం ధర్నాలు చేయించడం ఏంటి? అని ప్రశ్నించారు. పదవులు అడగడం తప్పు లేదు.. కానీ ఇవాళ ఒకరు ధర్నా చేశారు అని… రేపు ఇంకొకరు చేస్తారు అని తెలిపారు. పీసీసీ కమిటీలో పదవులు వచ్చిన వారికి నియామకం పత్రాలు అందించే కార్యక్రమం ప్రారంభమైంది. పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని రెండుగా జాబితా సిద్ధం చేయండని సీఎం పిలుపునిచ్చారు. ముందు అందరికీ పని అప్పగించాలని స్పష్టం చేశారు. పని చేసిన వాళ్ళు ఒక జాబితా.. పని చేయని వాళ్ళది మరో జాబితా సిద్ధం చేయాలన్నారు. పని చేయకపోతే డిమోషన్.. పని చేస్తే ప్రమోషన్ ఇద్దామన్నారు. మొహమాటం అవసరం లేదని స్పష్టం చేశారు.
READ MORE: AP Cabinet: అమరావతిలో మలివిడత భూసేకరణ.. కేబినెట్ కీలక నిర్ణయం
