మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అనేది కేవలం ఒకరిద్దరి నిర్ణయం కాకూడదని, అత్యంత పారదర్శకంగా , సమిష్టిగా సాగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆయా మున్సిపాలిటీల బాధ్యతలు చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు , సీనియర్ నాయకులు అందరూ కలిసి చర్చించి, ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో అందరినీ కలుపుకుని పోవడం వల్ల పార్టీలో అంతర్గత విబేధాలు రాకుండా ఉంటాయని, ఇది ఎన్నికల్లో పార్టీ…
మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జి మంత్రులదే అని స్పష్టం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలపై ఇన్‌ఛార్జి మంత్రులు దృష్టిపెట్టడం లేదని.. ఇది కరెక్ట్ కాదన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని సూచించారు. కార్యకర్తలను నారాజ్ చేయకండని పిలుపునిచ్చారు.