మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జి మంత్రులదే అని స్పష్టం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలపై ఇన్‌ఛార్జి మంత్రులు దృష్టిపెట్టడం లేదని.. ఇది కరెక్ట్ కాదన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని సూచించారు. కార్యకర్తలను నారాజ్ చేయకండని పిలుపునిచ్చారు.
జనసేన నుంచి తాజాగా ఓ లేఖ విడుదలైంది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్‌లో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. అనంతరం సీఎం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పలువురు నాయకులను ఉద్దేశించి హెచ్చరించినట్లు తెలుస్తోంది. తనని నమ్ముకున్న వాళ్లని తాను ఎప్పుడూ మర్చిపోనని సీఎం రేవంత్ అన్నారు. తనని నమ్ముకున్న వాళ్లలతో అద్దంకి దయాకర్ ఉన్నారని.. దయాకర్‌కు ఎమ్మెల్సీ వచ్చిందన్నారు. ఓపికతో ఉంటే నాకూ బాధ్యత ఉంటుంది..