Aasmaan : గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత లెజెండరీ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం ‘ఆస్మాన్’ (Aasmaan) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రామ్ నందన్ దర్శకత్వంలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు అరబిక్ భాషల్లోనూ ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.
తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ ఆద్యంతం గూస్బంప్స్ తెప్పించేలా డిజైన్ చేశారు. ఒక భారీ అరచేయి మధ్యలో హీరో మేఘాంశ్ చేతిలో వెలుగుతున్న కాగడాతో పవర్‌ఫుల్‌గా నిలబడి ఉండటం ఆకట్టుకుంటోంది. ఆ చేతి వెనుక భాగంలో ఒక నుదురు, దానిపై ప్రత్యేకంగా తీర్చిదిద్దిన తిలకం సినిమాలోని రహస్య కాన్సెప్ట్‌ను ప్రతిబింబిస్తోంది. చుట్టూ జనాలు కాగడాలు పట్టుకుని నిలబడటం వెనుక ఉన్న మిస్టరీ ఏంటనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.
Also Read
తల్లిగా శాంతి శ్రీహరి భావోద్వేగం: “శ్రీహరి గారు ఎలాగైతే పగలు, రాత్రి కష్టపడి పనిచేశారో.. మేఘాంశ్ కూడా అంతే డెడికేషన్‌తో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటివరకు నా కొడుకుని చిన్న పిల్లాడిలాగే చూశాను, కానీ ఈ పోస్టర్లో చూశాక వాడు నిజమైన సింహంలా కనిపించాడు. ఒక తల్లిగా మేఘాంశ్‌కి ‘ఆస్మాన్’తో సాలిడ్ హిట్ రావాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు. రాయంచ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రవివర్మ, కమల్, కేశవ్ దీపక్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం, షోయబ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
తాజావార్తలు
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?