Site icon NTV Telugu

Telangana Water Rights: తగ్గేదేలే.. కృష్ణా, గోదావరి జలాల వాటాపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం..

Telangana Water Rights

Telangana Water Rights

Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

READ MORE: CM Revanth Reddy: గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు.. గోదావరి నీళ్లు తేవడం.. సీఎం సంచలన వ్యాఖ్యలు..

ఆయన సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాశారు. ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. “కృష్ణా నదీ జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. గడిచిన పదేండ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైంది. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడి, కృష్ణా నీళ్లను ఏపీ యధేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసింది. అటు గోదావరిపై తుమ్మిడిహెట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కనబెట్టింది. దానికి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రూ. లక్ష కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసింది.” అని ప్రకటనలో పేర్కొన్నారు.

READ MORE: Kota : కోట శ్రీనివాసరావును పడేసి కొట్టబోయిన ఎన్టీఆర్ అభిమానులు..ఎందుకో తెలుసా ?

Exit mobile version