Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
తెలంగాణ ఉద్యమంలో సర్వం ఒడ్డి కొట్లాడిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారని.. పార్టీల కంటే ప్రజల అవసరాలు ముఖ్యం అని చెప్పే వాళ్లే ఇక్కడ ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అజెండా ఎలా ఉంది.. రాజకీయ ఆర్థిక ప్రయోజనం ఏం పొందారు అనేది చర్చనీయాంశం కాదని.. ఇక్కడ తొమ్మిదిన్నరేళ్ళు.. కేసీఆర్…