రైల్వే ఉద్యోగాలకు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. రైల్వే జాబ్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా రైల్వేలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ పలు జోనల్ రైల్వేలలో భారీగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీచేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 989 పోస్టులు భర్తీకానున్నాయి.
Also Read:MLC Kavitha : ఎంఎంటీఎస్ రైలు ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం
ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ వర్గాల వారికి సడలింపు ఉంటుంది. ఈపోస్టులకు సీబీటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:DD vs LSG: వైజాగ్ ఈసారైనా ఢిల్లీ క్యాపిటల్స్ కలిసి వస్తుందా?
ఎంపికైన వారికి నెలకు రూ. 19,900 జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు రూ. 250 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 10 నుంచి ప్రారంభంకానుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో మే 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.