చివరిగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ఒక రకంగా డిజాస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడింది. ఓటీటీలోకి వచ్చాక కూడా పూరి ఏంటి ఇలాంటి సినిమా చేశాడని ఆ ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి నెలకొంది. ఇక రామ్ పోతినేని తన తర్వాత సినిమా మహేష్ బాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మహేష్ బాబు అనే దర్శకుడు గతంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రామ్ తన 22వ సినిమా చేస్తున్నాడు.
Trivikram: గురూజీ 500 కోట్ల ప్రాజెక్ట్ లోడింగ్..
ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ వచ్చేసింది. నవంబర్ చివరి వారంలో కానీ లేదా డిసెంబర్ మొదటి వారంలో కానీ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒక ఎమోషనల్ డ్రామా అని అంటున్నారు. రామ్ చేయబోయే పాత్ర చాలామందికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో అయినా మరోసారి హిట్టు కొట్టాలని రామ్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కూడా ఆయన ఇప్పుడు వింటున్నాడు అని ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.