ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రగతి భవన్ బయట ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పార్టీ కార్యక్రమాలను బిజీ బిజీ గడిపారు. ఉదయం పదకొండున్నర గంటల తర్వాత సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అధికారులు ప్రజా ప్రతినిధితో చర్చించారు. అంతకుముందు జంట నగరాలలో నోటరీ భూముల క్రమబద్ధీకరణ. వ్యవహారం మీద జంట నగరాల వైసిపి ఎమ్మెల్యేలతోటి సమీక్షించారు. ఈ భూములను ఎలా క్రమబద్ధీకరిం చాలి అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. అక్కడే అధికార, అనదికట ప్రతినిధుల తో భేటీ అయ్యారు.
Also Read : Breaking News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్..
సాయంత్రం 4.30 గంటలకు సచివాలయంలో నుంచి ప్రగతి భవన్ కి వెళ్లిన కెసిఆర్.. గంట తర్వాత… తెలంగాణ భవన్ కి వచ్చారు. మహారాష్ట్ర నుంచి పార్టీలో చేరడానికి వచ్చిన వారిని చేరుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర పార్టీ విస్తరణ కార్యక్రమాల మీద రాష్ట్ర నాయకులు తో పాటు మహారాష్ట్రకు సంబంధించిన నాయకులు తోటి చర్చలు జరిపారు . బాగా పొద్దుపోయే వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి కేసీఆర్ ఈ విధంగా ఇంతసేపు ప్రగతిభం బయట కార్యక్రమాల్లో ఉండటం చాలా ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. కొత్త సచివాలయంలో ప్రారంభించిన మర్నాడే కెసిఆర్ ఇలా ఫుల్ టైం ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు ఫుల్ టైం కేటాయించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక నుంచి కెసిఆర్ షెడ్యుల్ ఇలాగే ఉంటుందనీ పార్టీ నేతలు అంటున్నారు.
Also Read : DK Aruna : మోడీ అలా అనడం.. తనకున్న పెద్ద మనసుకు నిదర్శనం