తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం నేడు జరిగింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ చేస్తున్న వికృత రాజకీయ చేష్టలకు తెలంగాణ నుంచే చరమగీతం పాడుదామన్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడిక్కడ బీజేపీ వికృత చేష్టలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉన్మాదంతో రాజకీయాలు చేసే ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన మండిపడ్డారు. 8 ఏండ్ల కాలంలో ఈడీ అనేక కేసులు పెట్టింది. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసును నిరూపించలేకపోయింది. బీజేపీ దగ్గర రూ. 2లక్షల కోట్లు ఉన్నాయని సింహయాజీ చెప్తున్నాడు. ఒక రాజకీయ పార్టీకి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది..? దీన్ని దేనికోసం వాడుతున్నారో తెలియజెప్పాల్సిన బాధ్యత మనమీద ఉన్నది. బీజేపీ కావాలని బెదిరింపులకు దిగే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేల మీద ఈడీ దాడులకు సైతం పూనుకోవచ్చు. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు.
Also Read : SSC Exam Fee : విద్యార్థులకు శుభవార్త.. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో త్వరలో కొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఏవైనా ప్రసాదాలు పంచిందా? గూండాగిరి చేసింది. దాదాగిరి చేసింది. దేశంలో కాంగ్రెస్ ముగిసిన అధ్యాయం. దేశమంతా రాల్గాంధీ జోడోయాత్ర చేస్తాడు కానీ, గుజరాత్ ఎన్నికలు ఉన్నాయని తెలిసి..అక్కడ జోడో యాత్ర చేయకపోవడం వెనుక ఆంతర్యం తానే కాదు ఎవరేం చేసినా కాంగ్రెస్ బతకదని చెప్పే ప్రయత్నం. దళితబంధు కోసం నియోజకవర్గానికి 500 కుటుంబాల చొప్పున లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి. పోడు భూముల సమస్యకు త్వరలో పరిష్కారం. రాష్ట్రంలో 11. 5 లక్షల ఎకరాల భూమికి శాశ్వత పరిష్కారం లభించనున్నది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. అవి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలి. ఆత్మీయ సమ్మేళనం అంటే ఏదో భోజనాలు చేసి పోయాం అన్నట్టుగా ఉండకూడదు. వీటికి మంత్రులు కూడా హాజరు కావాలి. జిల్లా పార్టీ కార్యాలయాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రెటరీ జనరల్ కేకే ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి.
Also Read : DK Aruna : బీజేపీ ఎప్పుడో టీఆర్ఎస్పై యుద్ధం ప్రకటించింది
త్వరలో జిల్లా పర్యనలు చేస్తా. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయి. సిట్టింగ్‌లకే సీట్లు. 95 సీట్లను అవలీలగా గెలుస్తాం. ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల వారీగా ప్రోగ్రెస్ కార్డులను రూపొందించాలి. మన ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ అందులో ఉండాలి. ఎమ్మెల్యేలందరూ ప్రతీ 100 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జీని నియమించాలి. ఆ జాబితాను పంపించాలి. ఫోన్లు చేసి పార్టీ మారుతారా? అని ఎవరైనా అంటే చెప్పుతో కొడతా అని గట్టిగా చెప్పాలి. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ప్రజలుంటే 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీలో దర్జాగా ఉన్నామనే ధైర్యంగా ఉండాలి. నియోజకవర్గాల్లో సొంత జాగ ఉండి. ఇల్లులేని వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షలు ఇస్తాం. ఎమ్మెల్యేలు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో ఉండండి.’ అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.