బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నియోజకవర్గాల వారీగా బహింరగ సభలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి నికార్సైన నాయకుడు… ఉద్యమంలో నా వెంటే ఉన్నాడన్నారు. జడ్చర్లను పరిశ్రమల, ఐటీ హబ్ గా మారుస్తానన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్టుదల గల నాయకుడని ఉద్యమంలో తన వెంటే ఉంటూ తాను రాజీనామా చేసిన భయపడకుండా వెనకడు వేయకుండా రాజీనామా సమర్పించిన నికార్సైన నేత Dr.సి.లక్ష్మారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు.
Also Read : IND vs BAN: బంగ్లాతో మ్యాచ్‌లో స్పెషల్ ప్లాన్స్ లేవు.. మాకు క్లారిటీ ఉంది..!
జడ్చర్ల ప్రజాఆశీర్వాద సభలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని తండాలను పంచాయతీలు చేశామని, సెజ్ ఏర్పాటుతో వేలాదిమందికి ఉపాధి దొరికిందని చెప్పారు. జడ్చర్లను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదంటూ కేసీఆర్ చెప్పడంతో సభ ఒక్కసారిగా ఈలలతో హర్షద్వానాలతో దద్దరిల్లిపోయింది. ప్రజాఆశీర్వాద సభలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల పట్టణం రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా పట్టణ జనాభా లక్ష వరకు ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు బైపాస్ రోడ్డును కూడా మంజూరు చేయాలని కోరడంతో సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఎన్నికలు ముగిసిన తక్షణమే హామీలు అమలయ్యేలా చేస్తానని తెలిపారు. హైదరాబాద్ కు జడ్చర్ల సమీపంలో ఉన్నందున జడ్చర్లను ఐటీ, పరిశ్రమల హబ్ గా మారుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఉదండాపూర్ రిజర్వాయర్ కు నీళ్లు అందించి జడ్చర్ల నియోజకవర్గంలో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అంతేకాకుండా.. మహబూబ్‌నగర్‌లో 14 సీట్లు గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.
Also Read : Allu Arjun: వీడు ఎక్కడున్నా పుష్ప ‘రాజే’రా