CM KCR : కేటీఆర్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు… ఆదరించి గెలిపించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే నేడు సిరిసిల్లలో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు మానేరు సజీవ జల ధార గా మారిందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మానేరు మట్టి కొట్టుకుపోయిందని, సిరిసిల్లలో ఆత్మహత్యలు వద్దని వాల్ రైటింగ్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు. రాష్ట్రం వచ్చాక చేనేత నేతన్నల ఆత్మహత్యలు అపగలిగినమని, షోలాపూర్ ఎట్లుంటదో సిరిసిల్ల అలా అవుతుందన్నారు. నేతన్నలకు ఉపాధి పేదలకు బట్టలు అందించే విధంగా కృషి చేశామని, కొందరు దుర్మార్గులు బతుకమ్మ చీరలు కాలబెట్టారు… వారిని బతుకమ్మ చీరలు ఎవరు కట్టుకోమన్నారు? బలవంతం చేశామా? అని కేసీఆర్ అన్నారు.
Also Read : Star Hospitals: నానక్‌రామ్‌గూడలో అతిపెద్ద ట్రామా సెంటర్‌ను ప్రారంభించిన స్టార్ హాస్పిటల్స్
Also Read
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
అంతేకాకుండా.. ‘బతుకమ్మ చీరలు పెట్టింది నేతన్నలకు ఉపాధి, పేదలకు బట్టలునిచ్చేందుకు ఉద్దేశించింది… మూడు కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయ్ అందుకే ప్రతీ ఒక్కరూ సన్నబియ్యం తినాలని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టాం.. రైతుల భూములు క్షేమంగా ఉంచేందుకు ధరణి పోర్టల్ తెచ్చాం.. కాంగ్రెస్ సిద్ధంగా ఉంది ధరణిని రద్దు చేసేందుకు కంకణం కట్టుకున్నారు… రైతు బొటనవేలు లేకుండా భూమి హక్కులు పోకుండా చేశాం ధరణి లేకపోతే హత్యలు జరిగేవి.. కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులో ఉన్న విషాన్ని కక్కిండు… 3 గంటల కరెంట్ చాలు అన్నాడు. మోడీ వ్యవసాయ బావుల కు మోటార్లు పెట్టాలని అంటే తిరస్కరించాం. తెలంగాణ గంగా జమున తెహజీబ్.. కొందరు గొడవలు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు… గణేష్ నిమజ్జనం కోసం.. మిలాదున్ నబీ ని ముస్లిం పెద్దలు వాయిదా వేశారు ఇది మతసామరస్యం. కేటీఆర్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు… ఆదరించి గెలిపించండి..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Ayurveda Tips for Kidney: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలపై శ్రద్ధ వహించండి..
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!