తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలన్నా సీఎం కేసీఆర్. తెలంగాణ దశాబ్ది వేడుకలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్యుత్, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలన్నారు సీఎం కేసీఆర్. అంతేకాకుండా.. 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల ప్రారంభ వేడుకలను జూన్ 2న ‘డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’లో నిర్వహణ, జూన్ 2 ప్రారంభం నాడు రాష్ట్ర సచివాలయంలో స్టేజి ఏర్పాటు సహా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండా ఎగురవేయడం తదితర అధికార కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించి సీఎం కేసీఆర్ చర్చించారు. ఆహ్వానితులకు పార్కింగ్ సౌకర్యం, అతిథులకు ‘హై టీ’ ఏర్పాటు వంటి కార్యక్రమాలను ఎక్కడ, ఎట్లా నిర్వహించాలో వివరిస్తూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు కేసీఅర్. జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాల ఏర్పాట్ల గురించి కేసీఅర్ చర్చించారు.
Also Read : Ram Charan: ఎన్టీఆర్ తో బ్రేక్ ఫాస్ట్ చేశా.. అంతకు మించిన అదృష్టం లేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లవుతున్న సందర్భంగా నెల రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని, హైదరాబాద్ నగరంలో వారం రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అమరుల త్యాగాలు స్మరించుకోవడం సహా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా కార్యక్రమాలు జరుపాలని చూస్తున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులతో సీఎం చర్చించారు.
Also Read : Assam: “నో జీన్స్, లెగ్గింగ్స్”.. గవర్నమెంట్ టీచర్లకు డ్రెస్ కోడ్..