Pushpa 2: ‘పుష్ప 2’ లో శ్రీలీల ఐటెంసాంగ్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. గతేడాది నుంచి ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే. బన్నీ, రష్మిక నటన అంతా ఒక ఎత్తు అయితే.. సమంత ఐటెంసాంగ్ మరో ఎత్తు అని చెప్పొచ్చు. ఊ అంటావా.. మావా.. అంటూ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఈసారి పుష్ప 2 తో కూడా అంతకు మించి చేయాలనీ చూస్తున్నాడట. ఇందుకోసం సుకుమార్ బాగా కష్టపడుతున్నాడని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా సామ్ లా ఐటెంసాంగ్ చేసే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెల్సిందే. ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఊర్వశీ రౌతేలాను ఫిక్స్ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని సమాచారం.
Pawan Kalyan: పవన్ కౌంటర్… రోజా భర్తకేనా?
ఇక తాజాగా ఈ ఐటంసాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ బిజీయెస్ట్ హీరోయిన్ శ్రీలీల. అవును.. మీరు విన్నది నిజమే. అమ్మడి డ్యాన్స్ కు ఫిదా అయిన సుకుమార్ .. బన్నీతో ఈ చిన్నది కలిస్తే మరింత హైప్ వస్తుంది అని భావించి శ్రీలీలను సంప్రదించారట. అయితే శ్రీలీల మాత్రం.. బన్నీతో ఒక్క సాంగ్ చేస్తే.. ఫుల్ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వస్తుందో.. రాదో అని ఆలోచిస్తుందట. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఇది మాత్రం నిజం కాదు అని శ్రీలీల అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఆమె.. ఒక ఐటెంసాంగ్ చేస్తుందా.. ? ఇదంతా ఫేక్ అని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
Also Read
- Mookuthi Amman 2: అమ్మోరు పాత్రలో మళ్లీ నయనతార… ఫాంటసీ ఎంటర్టైనర్ కి భారీ ఓటీటీ డీల్?
- Hyper Adhi: ‘అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’..!
- Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
- Jailer 2 First Single: రజనీకాంత్ 'జైలర్ 2' ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘అలా బొలేలో’తో అనిరుధ్ మ్యాజిక్.. పాటలో పూర్ణే హైలైట్!
తాజావార్తలు
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
-
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
-
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్‌పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
-
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?