Telangana Government : జీవో నెం.4 ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 24 గంటల పాటు దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ ఓపెన్ చేసి ఉంచుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988ను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. సెక్షన్ 7 ప్రకారం లైసెన్సు తీసుకున్న దుకాణాలు ఏవైనా ఇక నుంచి 24 గంటలు తెరిచే ఉంచేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే.. ఇందుకోసం సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున ఎక్స్‌ట్రా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలా కట్టిన వారికి సంవత్సరం పొడవునా 24/7 దుకాణం తెరిచే ఉంచుకోవచ్చని… కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అన్ని దుకాణాలు మరియు సంస్థలు 24×7 తెరిచి ఉండకూడదని, రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన వారు మాత్రమే తెరిచి ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. ఏప్రిల్ 4న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GO) ద్వారా రాష్ట్రంలో 24×7 వ్యాపారం కోసం తెరవబడే దుకాణాలు మరియు సంస్థలకు మినహాయింపు మంజూరు చేయబడింది. అయితే, అనుమతికి పరిమితులు ఉన్నాయని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. జీవో నెం.4 ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
Also Read : MP Nama Nageswara Rao : ప్రధాని పర్యటనలో రాష్ట్రానికి కేంద్రం నిధులతో అభివృద్ధి అనేది భూటకం
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
‘ఇప్పటికే దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన న్యూ ఢిల్లీ, ముంబాయ్ , బెంగుళూరు లలో 24 / 7 గంటలు షాపులు తెరిచి ఉంచే నిబంధనలు అమలులో ఉన్నాయని, జీ.ఓ. ఎం.ఎస్. నెం. 4 ప్రకారం జారీచేసిన ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్ర షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్స్ ఆక్ట్, 1988 పరిధి కి లోబడే అమలు అవుతాయి. ఈ ఉత్తర్వులు అన్ని షాప్ లకు ఆటోమేటిక్ గా వర్తించదు. 24 /7 గంటలు తెరిచి ఉంచాలనుకునే షాపులు ప్రత్యేక నిబంధనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకనుగుణంగా తగు అనుమతులు పొందిన అనంతరమే తమ షాప్ లను 24 /7 గంటలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ జీవో 4 అన్ని షాపులకు వర్తించవు. జీ.ఓ. ఎం.ఎస్. నెం. 4 తేదీ. 4 .4 .2023 ఉత్తర్వులు ఎక్సయిజ్, ప్రొహిబిషన్ శాఖ కు వర్తించవు. ఎక్సయిజ్ చట్టాలు, నిబంధనల ననుసరించి టీఎస్ బిసిఎల్, ఐ.ఎం.ఎఫ్.ఎల్ డిపోలు, డిస్టిలరీలు, బ్రివరీలు, A4 షాపులు, 2B బార్లు కు ప్రత్యేక బిజినెస్ సమయం ప్రకారం మాత్రమే తెరచి ఉంటాయి.’ అని.. కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటనను విడుదల చేశారు.
Also Read : Phone Call: ఆస్పత్రికి ఫోన్ చేసింది… రెండు లక్షలు పోగొట్టుకుంది
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!