CM KCR Criticized Union Government
ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. దీంతో.. రాష్ట్ర రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో నేడు మునుగోడు ప్రజా దీవెన పేరుతో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మునుగోడు ఉప ఎన్నిక రైతుల బతుకుపోరాటం.. దేశంలో మతపిచ్చి ఎవరికి మంచిది.. అంతా బాగుండాలి.. అందులో మనం ఉండాలి.. దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రూపాయి విలువ 80 రూపాయలా? మోడీ పాలనలో రూపాయి కిందపడింది.. నిరుద్యోగం పెరిగింది.. రైతుల్ని బతకనివ్వడం లేదు.. మీరంతా రేపు అడగాలి.. కరెంట్ పోతే ఎంత ఇబ్బంది.. కరెంట్ పోకుండా చూస్తున్నాం.. ఐటీ ఉద్యోగాలు వచ్చాయి.. జనం సంతోషంగా బతుకుతున్నారు.. మళ్ళీ సభ పెడదాం.. అప్పుడు వేరేవాళ్ళని తీసుకొస్తా.
CM KCR : మునుగోడులో గోల్‌మాల్ ఉప ఎన్నిక వచ్చింది
మునుగోడులో అంతా ఏకమవుదాం… సీపీఐ కలిసింది.. సీపీఎం రాబోతుంది..అంతా కలిసి మనం ముందుకెళతాం.. కాంగ్రెస్ ది గొర్రె బతుకే.. కాంగ్రెస్ కి ఓటు వేస్తే వృధా.. మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు దెబ్బ కొడితే నషాళానికి అంటాలి.. తెలంగాణ ఏమంటుందో మునుగోడు నుంచి ఢిల్లీ దాకా పోవాలి.. బొమ్మలు చూసి, గజకర్ణ గోకర్ణ టక్కుటామారా విద్యలకు మోసపోవద్దు.. మహిళలు ఇంటికెళ్లి చర్చ చేయాలి.. పెన్షన్లు, కరెంట్, ఉన్న వసతులు ఊడగొట్టుకుందామా? ఛస్తే జీఎస్టీ, పిల్లల మీద జీఎస్టీ… మోసగాళ్ళకు వేలకోట్లు మాఫీ చేస్తున్నారు..’ అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.