మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సోషియో ఫాంటసీగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన జోడిగా త్రిష నటించబోతున్నారు.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పడంతో శరవేగంగా షూట్ జరుగుతుంది.. తాజాగా చిరు త్రిషకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఆ గిఫ్ట్ ని వీడియో తీసి త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. చాలా ఫ్యాన్సీగా ఉంది. నా సొంత టెంపరేచర్ కంట్రోల్ మగ్. నాకు బాగా నచ్చింది. థ్యాంక్యూ చిరు సర్ అని తెలిపింది. ఇంతకీ చిరంజీవి త్రిషకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే ఒక ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ బాటిల్ అని తెలుస్తుంది.. మనకు తగ్గ టెంపరేచర్ లో దాన్ని ఉంచుకోవచ్చు.. అంతేకాదు ఆ బాటిల్ పై హలో త్రిష అని వస్తుంది కూడా..
ఆ బాటిల్ పై ‘హలో త్రిష్’ అని లైటింగ్ తో పేరు వచ్చేలా కూడా ఉంది. దీంతో ఈ బాటిల్ త్రిషకు బాగా నచ్చింది. చిరంజీవి త్రిషకు ఈ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం, త్రిష దాన్ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో పాటు ఇది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అని కూడా త్రిష పోస్టులో రాసుకొచ్చింది. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతుంది..