స్వాతంత్య్రోద్యమ పోరాటంలో దమ్ముంటే కాల్చండి.. రండిరా అంటూ పోలీసులకే ఎదురెళ్లి చొక్కా విప్పి రొమ్ము చరిచి నిలబడ్డ ఘనుడు టంగుటూరి ప్రకాశం పంతులు. సంతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రజల కోసం తన యావదాస్తిని ఖర్చు చేసిన మహాశిలి ఈ ఆంధ్రకేసరి. అయితే నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భాంగా ఆ మహనీయుడికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడని కొనియాడుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ‘స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు.’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరి లో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన ముత్తాత టంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవాడు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అనే ఇద్దరు కుమారులు. ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామి టంగుటూరులో కరణీకం చేసేవిధంగా, ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గర్లో ఉన్న వల్లూరులో కరణీకం చేసేట్లుగా నిర్ణయించారు. ఆయనే ప్రకాశం తాతగారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో ఆఖరి వాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం సంతానంగా జన్మించాడు. ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు.
Also Read : Heath Streak Alive: థర్డ్ అంపైర్ వెనక్కి పిలిచాడు.. జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ చనిపోలేదు!