మహాయజ్ఞం లో సీఎం షెడ్యూల్
యాగశాలకు చేరుకున్న సీఎం జగన్
9.10 కు పాంచరాత్ర యాగశాలలో, 9.20కి వైదిక స్మార్త యాగశాలలో విశేష పూజా కార్యక్రమాలు పూర్తి
9.30 నుంచి 9.50లోపు రాజశ్యామల అమ్మవారు వేంచేసి ఉన్న వైఖానస యాగశాలలో పూర్ణాహుతికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. హాజరైన హోంమంత్రి తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
10.10 కి శైవ ఆగమ శాలలో పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నల్లకలువలతో వేదమంత్రోచ్ఛరణల మధ్య రుత్విక్కులు, ఘనాపాటిలు, పండితులతో విశేషంగా పూజా కార్యక్రమాలు.
10.20 కు అభిషేక మండపానికి రానున్న సీఎం.
సీఎం చేతుల మీదుగా కంచి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన స్వర్ణ ప్రతిమ రూపంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం.
క్రతువులో భాగంగా సీఎం కు యజ్ఞ ప్రసాదం ఇవ్వనున్న రుత్విక్కులు.
యజ్ఞ దీక్ష చేపట్టిన మంత్రి కొట్టు దంపతులు ముఖ్యమంత్రికి నూతన పట్టు వస్త్రాలు బహుకరణ.
అనంతరం రుత్విక్కులు, వేద పండితులు, పీఠాధిపతుల సమక్షంలో ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం
ఆ తర్వాత వేద పండితులను, పీఠాధిపతులను సత్కరించనున్న సీఎం.
పుణ్య కలశ జలాల సంప్రోక్షణతో పూర్ణాహుతి కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయానికి సంబంధించిన 180 కోట్ల అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్ పరిశీలించనున్న సీఎం.