గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో.. రానున్న కొద్ది గంటల్లో గోదావరి వరద మరింత పెరగనుంది.
ప్రజారోగ్య మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చాలాకాలంగా ప్రభుత్వ ఆమోదం కోసం మాజీ డీహెచ్ శ్రీనివాసరావు వేచి చూస్తుండగా.. ఈ క్రమంలో.. ఆయన వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది.
గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. 'పాస్ పుస్తకాలపై తన బొమ్మవేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పుల్ని సరిదిద్దుతున్నామన్నారు. తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మ ఉండకూడదనేది ప్రజాభిప్రాయం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. నాటి అహంకార, పెత్తందారీ పోకడలు ప్రజాప్రభుత్వంలో ఉండవు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి వారి ఆస్తులకు…
సార్వత్రిక ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయుధాల కేసులో తాజాగా ఆయనకు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
గత వారం నుంచి దేశ వ్యాప్తంతా ఆయా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల గాలివానతో పాటు వడగండ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఆస్తి, ప్రాణనష్టాలు కూడా జరిగాయి.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జీఎస్టీలో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్)ని మనీలాండరింగ్ నిరోధక చట్టం( పిఎంఎల్‌ఎ) పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.