త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి పట్టాదారు పాసుపుస్తకం పై రాజముద్ర వేసి ఇస్తామని చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు.
గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. 'పాస్ పుస్తకాలపై తన బొమ్మవేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పుల్ని సరిదిద్దుతున్నామన్నారు. తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మ ఉండకూడదనేది ప్రజాభిప్రాయం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. నాటి అహంకార, పెత్తందారీ పోకడలు ప్రజాప్రభుత్వంలో ఉండవు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి వారి ఆస్తులకు…