Site icon NTV Telugu

CM Chandrababu: రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే అన్నదాత పథకాన్ని ప్రారంభిస్తామన్న సీఎం

Cm Chandrababu

Cm Chandrababu

టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోందని.. తిప్పికొట్టండని శ్రేణులకు సూచించారు.

READ MORE: Aligarh Plane Crash: తృటిలో తప్పిన పెనుప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా గోడను ఢీకొన్న శిక్షణ విమానం

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే అన్నదాత పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. “పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేలు అందిస్తాం. సూపర్-6 హామీలు అమలు చేయడంతో పాటు ఆర్థిక, ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ప్రభుత్వం చేపడుతున్న కారక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికశాతం కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, కోపరేటివ్, ఏఎంసీ ఛైర్మన్‌ల నామినేటెడ్ పదవులను భర్తీ చేశాం.మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. సామాజిక న్యాయం పాటించి పదువులకు ఎంపిక చేస్తున్నాం. పార్టీ సంస్థాగత ఎన్నికలు కూడా నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు మే 18 నాటికి పూర్తి చేయాలి. ఈ సారి మహానాడును కడపలో 27, 28, 29 తేదీల్లో నిర్వహించుకుంటున్నాం. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ పూర్తి చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయి. సభ్యత్వం తీసుకున్న వారికి కార్డులు కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేయాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కార్యకర్తల, ప్రజల అభిప్రాయాల మేరకు నాయకులు పని చేయాలి. గుజరాత్ మోడల్ ఏపీలోనూ అమలవ్వాలి. సుస్థిర ప్రభుత్వం ఉండటంతో గుజరాత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.” అని సీఎం తెలిపారు.

READ MORE: Riyan Parag: 2023లో చెప్పాడు, 2025లో బాదాడు.. రియాన్ పరాగ్ తోపెహే!

అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం చాలా బాగా జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. “సభ విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలందరినీ అభినందిస్తున్నా. రాష్ట్రానికి గతంలో ప్రధాని నరేంద్రమోడీ వచ్చినప్పటికీ ఈసారి అన్నింటినీ మరిపించేలా ఈ సభ జరిగింది. రాజధాని పనుల పున:ప్రారంభం కార్యక్రమంతో దేశం, ప్రపంచం దృష్టి అమరావతిపై మళ్లింది. ప్రజలు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి సభకు వచ్చి వెళ్లేదాకా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అమరావతి ఆవశ్యకతను తెలియజేసేందుకు, పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రధాని చేతుల మీదుగా పున:ప్రారంభం చేశాం. వికసిత్ భారత్‌ 2047కు అమరావతి బలమైన పునాదిగా మారుతుందని ప్రధాని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఇక ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక. యువతకు అవకాశాలు, ఉద్యోగాలు కల్పించే విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది. ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పున:నిర్మాణం చేస్తామని ప్రధాని మోదీ, నేను, పవన్ కళ్యాణ్ చెప్పాం. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక గతి తప్పిన రాష్ట్రాన్ని గాడినపెట్టాం. పోలవరానికి నిధులు రాబట్టి 2027 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం.” అని వ్యాఖ్యానించారు.

Exit mobile version