CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీవర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురు గాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ, అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
READ MORE: Kodamasimham : చిరంజీవి “కొదమసింహం” రీ రిలీజ్.. ఎప్పుడంటే?
ఇదిలా ఉండగా.. ఏపీకి మరోసారి వాన గండం పొంచి ఉంది. ప్రస్తుతం పశ్చిమమధ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. అలానే రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ మడ్రేవు గ్రామంలో ఈదురుగాలులు దెబ్బకు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. దీంతో స్థానిక గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులు ప్రభావంతో గ్రామంలో ఉన్న కొన్ని ఇళ్ల పైన రేకులు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. వర్షంలో పంట పూర్తిగా తడిచి ముద్దయ్యాయి.
READ MORE: Osmania Hospital : ఉస్మానియా కొత్త ఆస్పత్రి భవనం ఎన్ని అంతస్తులో తెలుసా.?