CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీవర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురు గాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు..