Site icon NTV Telugu

CM Chandrababu : దళితుల కోసం మంచి స్కీంను తీసుకొస్తాం..

CM Chandrababu

CM Chandrababu

దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రోజు మన అందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ అన్నారు.. 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని.. చదువుకోవాలనే ఆశ ఉండే పిల్లలందరినీ చదివిస్తామని హామీ ఇచ్చారు. తొందర్లోనే మంచి స్కీంను తీసుకొస్తామని తెలిపారు. అమరావతికి దేశంలోని మంచి కాలేజీలు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 21 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని గుర్తు చేశారు. మీ ఇంటిపైనే సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

READ MORE: Volkswagen Tiguan R-Line: స్పోర్టీ డిజైన్‌తో మార్కెట్‌లోకి వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్‌.. ధర ఎంతంటే?

అదనపు కరెంట్‌ను డిపార్ట్‌మెంట్‌కు ఇస్తే యూనిట్‌కు 2.09 పైసలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సొంతూరిలోనే బంగారు భవిష్యత్తు ఉందని పిల్లలు భావిస్తున్నారన్నారు. “పేదలకు అండగా ఉంటానని అందరికీ హామీ ఇస్తున్నా. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. దళితుడిని లోక్‌సభ స్పీకర్ గా చేసిన పార్టీ టీడీపీ. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చాం. ప్రతిష్టాత్మక వర్సిటీలు అమరావతికి తరలివస్తున్నాయి. సబ్ ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తాం.
దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దళితులకు 8 లక్షల ఎకరాలను టీడీపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. అంబేద్కర్ విదేశీ విద్యాదీవెనను మళ్లీ ప్రారంభిస్తాం.” అని సీఎం చంద్రబాబు అన్నారు.

READ MORE: Rahul Gandhi: రాజస్థాన్‌ పర్యటనలో రాహుల్‌గాంధీకి వింత అనుభవం.. కార్యకర్త ఏం అడిగాంటే..!

Exit mobile version