ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నూతన ఏడాది అన్నం పెట్టే అన్నదాతల జీవితంలో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ప్రతిఒక్కరు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. ‘రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం…