CM Chandrababu Naidu: ఏపీ సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయానికి చేరుకున్నారు
- తన భార్య నారా భువనేశ్వరితో కలిసి సచివాలయంలో అడుగుపెట్టారు
- ఐదేళ్ల తర్వాత సచివాలయానికి వచ్చిన చంద్రబాబు
- దారిపొడవునా చంద్రబాబుకు ఘన స్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సచివాలయానికి చేరుకున్నారు.. తన భార్య నారా భువనేశ్వరితో కలిసి సచివాలయంలో అడుగుపెట్టారు.. అయితే, చంద్రబాబు ఐదేళ్ల తర్వాత సచివాలయానికి వచ్చారు.. మరోవైపు తన నివాసం నుంచి సచివాలయం వరకు దారిపొడవునా చంద్రబాబుకు స్వాగతం లభించింది.. రోడ్డు వెంట, కూడళ్లలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆయనక స్వాగతం పలికారు.. ఇక, అమరావతి ప్రాంతంలో రైతులు.. ధర్నా శిబిరాలను తొలగించి.. చంద్రబాబుకు స్వాగతం పలికారు.. వెంకటాపాలెం వద్ద భారీ సంఖ్యలో చంద్రబాబు వద్దకు వచ్చారు అమరావతి రైతులు, మహిళలు.. కాన్వాయ్ లో డోర్ తీసుకుని బయటకు వచ్చారు చంద్రబాబు.. ఆయనపై పూలవర్షం కురిపించారు అమరావతి రైతులు, మహిళలు.. మరోవైపు.. ఆయన సచివాలయానికి చేరుకోగా.. ఘనంగా స్వాగతం పలికారు మంత్రులు, ఉద్యోగులు..
Read Also: Modi tadasana: తడసానా వీడియో విడుదల చేసిన ప్రధాని.. ఉపయోగాలివే!
Also Read
ఇక, ఇప్పటికే తన ఛాంబర్‌కు చేరుకున్నారు సీఎం చంద్రబాబు.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. సాయంత్రం 4:41 గంటలకు సీఎంగా తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు.. తొలి రోజు ఐదు సంతకాలు చేస్తారని తెలుస్తోంది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై చేయనున్నారు.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై రెండో సంతకం.. ఫించన్లు రూ. 4 వేలు చేస్తూ మూడో ఫైల్‌పై సంతకం.. స్కిల్ సెన్సస్, అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభంపై సంతకాలు చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!