CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్.. ఇక, మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సమావేశం అయ్యారు సీఎం చంద్రబాబు.. కూటమి ప్రభుత్వం నెల రోజుల పని తీరుపై చర్చించారు.. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలంటూ మంత్రులకు కీలక సూచనలు చేశారు.. హెచ్‌వోడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెల సమీక్షలు చేపట్టాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.. తమ తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు.. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచనలు చేశారు.. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని.. మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు.. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు ఉద్భోదించారు ఏపీ సీఎం.. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా.. మంత్రులు సమన్వయంతో వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు..
Read Also: మగవాళ్ళు చెవులు కుట్టించుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఆ..!
కేబినెట్ భేటీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం లభించింది.. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది.. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనుంది ఏపీ ప్రభుత్వం.. మరోవైపు.. పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం.. ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది.. ఇక, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చ జరగగా.. ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్.. ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది.. గవర్నర్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. కాగా, శ్వేత పత్రాలు ప్రస్తావనను అసెంబ్లీలో తేవాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్..