e-Cycle: ఏం ట్యాలెంట్ గురు.. ‘ఈ-సైకిల్’ తయారు చేసిన ఇంటర్ స్టూడెంట్.. సింగిల్ ఛార్జ్ తో 80KM రేంజ్
- ‘ఈ-సైకిల్’ తయారు చేసిన ఇంటర్ స్టూడెంట్
- సింగిల్ ఛార్జ్ తో 80KM రేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. సమయాన్ని బట్టి అది బయటపడుతుంది. ఇదే రీతిలో ఓ ఇంటర్ స్టూడెంట్ తన ట్యాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఏకంగా ఎలక్ట్రిక్ సైకిల్ ను ఆవిష్కరించాడు. ఇంటర్ స్టూడెంట్స్ అంటే దాదాపు కాలేజీకి వెళ్లడం, ఫ్రెండ్స్ తో సరదాగా గడపడం, చదువుకోవడం ఇవే వ్యాపకాలు ఉంటాయి. ఈ విద్యార్థి మాత్రం వీటిన్నిటితో పాటు వినూత్నంగా ఆలోచించి సరికొత్త ఆవిష్కరణకు ఆజ్యం పోశాడు. ఆ ఇంటర్ విద్యార్థి మరెవరో కాదు.. విజయనగరం జిల్లా తెర్లాం మండలం పూనివలస పంచాయతీ జాడవారి కొత్తవలసకు చెందిన రాజాపు సిద్ధు.
Also Read:ENG vs IND: బీసీసీఐది సరైన నిర్ణయం కాదు: డివిలియర్స్
Also Read
- UPI Transactions: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
రాజాపు సిద్ధు తన ఫ్రెండ్ తో కలిసి ఎలక్ట్రికల్ సైకిల్ రూపొందించాడు. అందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే సమయంలో ఉపాధ్యాయులు అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో నేర్పిన పాఠాలతో పాటు చాట్‌జీపీటీ, గూగుల్ సహాయం తీసుకున్నాడు. అవసరమైన సామగ్రిని రూ.35 వేలతో కొన్నాడు. ఇంకేముంది తను అనుకున్న ఈ సైకిల్ ను తయారు చేశాడు. ప్రతి రోజు అదే సైకిల్ పై కాలేజీకి వెళ్తున్నట్లు తెలిపాడు. ఈ సైకిల్‌ను మూడున్నర గంటల్లో ఫుల్ ఛార్జింగ్ చేయొచ్చు.
Also Read:Coolie : ‘చికిటు’ తెలుగు లిప్ సింక్ కోసం AI టెక్నాలజీ
సింగిల్ ఛార్జింగ్ తో 80 కి.మీ ప్రయాణించొచ్చని తెలిపాడు. 50కి.మీల గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుందని తెలిపాడు. మార్గ మధ్యలో ఛార్జింగ్ అయిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంచక్కా సాధారణ సైకిల్ లాగా తొక్కుకుంటూ గమ్యానికి చేరుకోవచ్చు. ఈ సైకిల్ తయారు చేసిన రాజాపు సిద్ధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన సిద్దును అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?