పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేశారు. సినిమా ప్రీమియర్ షో చూసేందుకు పలు రెండు రాష్ట్రాల్లోని పలు థియేటర్లకు పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి పంపించారు. రద్దీని నియంత్రించేందుకు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. సినిమా ప్రీమియర్స్ షోలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘హరిహర వీరమల్లు’ సూపర్ హిట్ కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు తాజాగా ఆయన ట్వీట్ చేశారు.
READ MORE: Pawan Kalyan Fans: కడపలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా.. బైక్ సౌండ్స్‌తో సందడి..
“పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రులు పవన్ కళ్యాణ్… చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన ‘హరిహర వీరమల్లు’ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.” అని సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
READ MORE: HHVM : సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. భారీగా పోలీసుల మోహరింపు..
