పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేశారు. సినిమా ప్రీమియర్ షో చూసేందుకు పలు రెండు రాష్ట్రాల్లోని పలు థియేటర్లకు పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి పంపించారు. రద్దీని నియంత్రించేందుకు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజాగా శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఉదయం ఏఎం రత్నం గురించి మాట్లాడాను, ఇప్పుడు అభిమానుల గురించి మాట్లాడుతాను” అంటూ మొదలుపెట్టిన ఆయన, “తాను పడుతూ లేస్తూ ఉన్నానంటే దానికి కారణం అభిమానులే” అని, “పడినప్పుడు ఓదార్చి, లేచినప్పుడు అభినందిస్తూ తనకు అండగా నిలబడ్డారు” అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సమయంలో రీమేక్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ, “ఎక్కువగా రీమేక్ చేస్తానని తిడతారు. కానీ ఏం చేయమంటారు, నా…
హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సినిమాని ఆదరించి ఇష్టపడే ప్రతి ఒక్కరికి, టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, శిల్పకళా వేదిక నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ఫంక్షన్ హైదరాబాద్, తెలంగాణలో కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందాం అని ప్లాన్ చేసినా, వర్షాభావాలు, ఇతర కారణాలవల్ల ముందుకు తీసుకెళ్లలేక ఫంక్షన్ సైజుని శిల్పకళా వేదికకు…
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న…
నిజం గడప దాటే లోపు అబద్దం ఊరు మొత్తం తిరిగి వస్తుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి బయ్యర్లు దొరకట్లేదని వార్తలు రావడమేంటి? దానిని నిజమని నమ్మడం కంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా?. నిజానికి తెలుగునాట పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. ఆయన సినిమా విడుదల అంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణమే. అలాంటిది పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’కి బయ్యర్లు దొరకట్లేదంటే…