పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేశారు. సినిమా ప్రీమియర్ షో చూసేందుకు పలు రెండు రాష్ట్రాల్లోని పలు థియేటర్లకు పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి పంపించారు. రద్దీని నియంత్రించేందుకు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Nidhi Agarwal : అందాలన్నీ నిధులుగా పోస్తే నిధి అగర్వాల్ అవుతుందేమో అన్నట్టుగా ఉంటుంది ఈ బ్యూటీ. అందానికి అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా అన్ని ట్యాలెంట్స్ తనలోనే దాచుకుంది. కానీ ఏం లాభం.. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. అదేం దురదృష్టమో గానీ.. అమ్మడి కెరీర్ లో హిట్ల కంటే ప్లాపుల సంఖ్య డబుల్ గా ఉంది. ఇస్మార్ట్ శంకర్, భూమి, కలగ తలైవాన్, హీరో, మిస్టర్ మజ్ను.. ఇలా…