పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేశారు. సినిమా ప్రీమియర్ షో చూసేందుకు పలు రెండు రాష్ట్రాల్లోని పలు థియేటర్లకు పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి పంపించారు. రద్దీని నియంత్రించేందుకు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.