పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేశారు. సినిమా ప్రీమియర్ షో చూసేందుకు పలు రెండు రాష్ట్రాల్లోని పలు థియేటర్లకు పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి పంపించారు. రద్దీని నియంత్రించేందుకు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ALso Read:…