నిజమాబాద్ జిల్లా బోధన్ బీఆర్ఎస్ లో వర్గ పోరు బయటపడింది. ఎమ్మెల్యే షకీల్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. పోటాపోటీగా ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. అయితే.. ఎమ్మెల్యే ఫ్లెక్సీల్లో మున్సిపల్ చైర్మన్ తూము పద్మ ఫోటోను పెట్టలేదు. దీంతో.. మున్సిపల్ చైర్మన్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటోను పెట్టలేదు. దీంతో.. మున్సిపల్ చైర్మన్ తీరుపై ఎమ్మెల్యే అనుచరులు మండి పడుతున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సహించమని, మున్సిపల్ చైర్మన్ పద్దతి మార్చుకోవాలని ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భర్త తూము శరత్ రెడ్డి మాట్లాడుతూ.. అభిమానం ఉన్న నాయకుల ఫోటోలు ఫ్లెక్సీల్లో వేస్తామని క్లారిటీ ఇచ్చారు.
Also Read : Today Stock Market Roundup 10-04-23: సెన్సెక్స్ ఇవాళ ఒకానొక దశలో 60 వేలు దాటి..
బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మాట వినని వారిపై బెదిరింపులకు దిగుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని తూము శరత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా.. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తే ఏసీపీ నువ్వు నా టార్గెట్ లోకి వచ్చావు అని బెదిరించారని ఆయన మండిపడ్డారు. ఫ్లెక్సీలు ఏర్పాటులో చైర్ పర్సన్ ఫోటో పెట్టకుండా అవమానించారని, వారూ మా ఫోటో పెట్టలేదు, మేము వాళ్ళ ఫోటో పెట్టమని ఆయన స్పష్టం చేశారు.
Also Read : DISNEY+ HOTSTAR: క్లీన్ కామెడీతో ‘సేవ్ ద టైగర్స్’!