Today STock Market Roundup 10-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని శుభారంభం చేసింది. ఇవాళ సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభించి సాయంత్రం స్వల్ప లాభాలతోనే ముగించింది. ఫైనాన్షియల్ మరియు ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకోవటంతో రెండు కీలక సూచీలు ఇంట్రాడేలో వచ్చి ప్రాఫిట్స్‌ని నిలబెట్టుకోలేకపోయాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ సూచీ ఇవాళ ఒకానొక దశలో 60 వేల బెంచ్ మార్క్‌ని దాటి 60 వేల 109 పాయింట్లకు చేరింది. చివరికి.. నామమాత్రంగా 13 పాయింట్లు మాత్రమే పెరిగి 59 వేల 846 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ కూడా 24 పాయింట్లు పెరిగి 17 వేల 624 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
Sports Sponsorships: ఆదాయం @ మైదానం. మన దేశ క్రీడా రంగానికి మరపురాని సంవత్సరం
సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, నెస్లె ఇండియా, రిలయెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఎస్‌బీఐ వంటి సంస్థలు బాగా వెనకబడ్డాయి. అదానీ గ్రూపులోని పది కంపెనీలు లాభాల బాటలోనే నడిచాయి. నిఫ్టీలో టాటా మోటార్స్ షేర్ల విలువ 5 శాతం పెరిగి ఆరేళ్ల గరిష్ట స్థాయిని చేరుకుంది.
బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, టాటా కన్జ్యూమర్, ఏసియన్ పెయింట్స్ స్టాక్స్ వ్యాల్యూ ఒక శాతానికి పైగా పడిపోయింది. రంగాల వారీగా చూసుకుంటే.. రియాల్టీ ఇండెక్స్ వరుసగా రెండో రోజు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించటం విశేషం. 10 గ్రాముల బంగారం ధర 152 రూపాయలు తగ్గింది.
గరిష్టంగా 60 వేల 359 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 149 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 74 వేల 719 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర అత్యంత స్వల్పంగా 42 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 635 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 7 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల పైన స్థిరపడింది.