Supreme Court Mobile App 2.0: అదనపు ఫీచర్లతో కూడిన సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 సిద్ధంగా ఉందని.. న్యాయ అధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ప్రకటించారు. కొత్త వెర్షన్ యాప్‌తో ప్రభుత్వ శాఖలు తమ పెండింగ్ కేసులను చూడవచ్చని సీజేఐ తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ 2.0 అందుబాటులోకి వస్తుందని, ఐఓఎస్ వినియోగదారుల కోసం ఒక వారంలో యాప్ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.
Udhayanidhi Stalin: డీఎంకే రైజింగ్‌సన్ ఉదయనిధి స్టాలిన్‌కు త్వరలో కేబినెట్ ఛాన్స్!
అదనపు ఫూచర్లతో యాప్‌ను తయారు చేసినట్లు జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. దీన్ని ఉపయోగించి ప్రభుత్వ అధికారులు పెండింగ్ లో ఉన్న కేసులను పరిశీలించాలని ఆయన తెలిపారు. నోడల్ అధికారులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులు,స్టేటస్ ఆర్డర్ లు, తీర్పులు, దాఖలు చేసిన ఏవైనా ఇతర పత్రాలను.. యాప్ లోకి వెళ్లి పరిశీలించవచ్చని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. 2021లో, మహమ్మారి సమయంలో కోర్టు ప్రాంగణాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా జర్నలిస్టులు సుప్రీంకోర్టు కార్యకలాపాలను నివేదించడానికి వీలుగా సుప్రీంకోర్టు మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది.