Site icon NTV Telugu

Mock Drill: హైదరాబాద్‌లో రేపు మాక్ డ్రిల్.. సైరన్ మోగగానే ప్రజలు ఏం చేయాలో తెలుసా?

Mock Drill

Mock Drill

పౌర రక్షణ బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన శత్రు దాడిలో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించేందుకు ప్రజలను సిద్ధం చేస్తోంది. పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పుడూ పౌర రక్షణ నిర్వహిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో స్పందించేందుకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంటాయి. పౌరులకు అవగాహన కల్పించి శిక్షణ ఇస్తాయి. పౌరుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు పని చేస్తాయి. శత్రు దాడి సమయంలో ప్రజల ధైర్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. ఈ మేరకు ‘ఆపరేషన్ అభ్యాస్’ అనే కోడ్ పేరుతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ మే 7వ తేదీ, మధ్యాహ్నం 4 గంటలకు జరగనుంది. హైదరాబాద్ నగరంతో పాటు మొత్తం 244 జిల్లాలు బలహీన ప్రాంతాలుగా గుర్తించారు. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్ పరిధిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. మొత్తం 12 పౌర రక్షణ సేవలు ఈ డ్రిల్‌ను చేపడతాయి. మాక్ డ్రిల్ కార్యక్రమం పథకం సిద్ధంగా ఉంది.

READ MORE: India-Pakistan tensions: యుద్ధం వస్తే పాకిస్తాన్‌ ‘‘అడుక్కు తినడమే’’.. మూడీస్ నివేదిక..

డ్రిల్ సమయంలో మధ్యాహ్నం 4 గంటలకు నగరమంతా సైరన్లు వినిపిస్తాయి. ఐసీసీసీ ద్వారా చర్యలు చేపడతారు. ఇండస్ట్రియల్ సైరన్లు, రోడ్డు జంక్షన్లు, పోలీసు మైకులు, పెట్రోలింగ్ వాహనాలు, అగ్నిమాపక సైరన్లు వినిపిస్తాయి. పోలీసు, అగ్నిమాపక, వైద్య, పారిశ్రామిక విభాగాలు 2 నిమిషాల్లో నగరంలోని అన్ని సైరన్లు స్విచ్ ఆన్ చేస్తారు. వైమానిక దాడి సైరన్ వినిపించినప్పుడు ప్రజలు వెంటనే భద్రత కలిగిన ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లాలి. దృఢమైన భవనం లేదా భూగర్భ ఆశ్రయం పొందాలి. అధికారిక సమాచార వనరులైన టీవీ, రేడియో, ప్రభుత్వ యాప్‌ల ద్వారా అప్డేట్లు పొందాలి. పుకార్లు నమ్మకుండా ధృవీకరించని సమాచారాన్ని విస్తరించకుండా చూడాలి. ఇంట్లో ఉంటే విద్యుత్ పరికరాలు, గ్యాస్, స్టవ్‌లను ఆఫ్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే లోతట్టు ప్రదేశానికి వెళ్లి నేలమీద పడుకుని తలను కప్పుకోవాలి. అధికారులు ప్రమాదం ముగిసిందని ప్రకటించే వరకు బయటకు రాకూడదు.

READ MORE: Vishnu Priya : విష్ణుప్రియ అందాల జాతర..

మధ్యాహ్నం 4 గంటల 15 నిమిషాలకు:
నగరంలోని 4 వేర్వేరు ప్రదేశాల్లో వైమానిక దాడి ప్రభావం గురించి ICCC పౌర రక్షణ సేవలను అప్రమత్తం చేస్తుంది. పోలీసు, అగ్నిమాపక, రెస్క్యూ/SDRF, వైద్య, రెవెన్యూ, GHMC వంటి సంబంధిత శాఖలు సంఘటన స్థలాలకు చేరుకుంటాయి. సంఘటన ప్రాంతాలను పోలీసులు క్లీన్ చేసి మిగతా CD సేవలకు ప్రవేశం కల్పిస్తాయి. యుద్ధంలో గాయపడినవారిని గుర్తించి రవాణా చేస్తాయి. ఈ బృందంలోని సభ్యులు ప్రజలను సురక్షిత ఆశ్రయాలకు తరలిస్తారు. అగ్నిమాపక దళం, రెస్క్యూ సేవలు తక్షణమే చర్యలు చేపడతాయి. సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు మిస్సింగ్ వ్యక్తుల జాబితాను ఇస్తారు. SDRF, DRF సేవలు శిథిలాలను తొలగించి ఇతర CD సేవలకు మార్గం కల్పిస్తాయి. వైద్య, ఆరోగ్య సేవలు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిస్తాయి. తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు. తరలించబడిన ప్రజలను సురక్షిత బంకర్లు/షెల్టర్లకు తీసుకెళ్లేలా రవాణా ఏర్పాట్లు చేస్తారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, GHMC ఇతర స్థానిక సంస్థలు తక్షణ సహాయం అందిస్తాయి.

READ MORE: Sabitha Indra Reddy: ఆ రోజు ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది..

బ్లాక్అవుట్ చర్యలు:
వైమానిక దాడుల సమయంలో శత్రు విమానాలకు పట్టుబడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. వీధిలైట్లు, బిల్డింగ్ లైట్లు, ప్రకాశవంతమైన ప్రకటనల లైట్లు ఆఫ్ చేయాలి. ఇళ్ల విండోలను కవర్ చేయాలి. వాహనాల హెడ్‌లైట్లను కవర్ చేయాలి లేదా వెలుతురు తగ్గించాలి. పవర్ స్టేషన్లు, కమ్యూనికేషన్ టవర్లాంటి కీలకమైన సౌకర్యాలు కప్పిపుచ్చాలి. ICCC ద్వారా నగరంలోని అన్ని కమ్యూనికేషన్ ఛానెళ్లకు సమాచారం పంపిస్తాయి. డ్రిల్ ముగింపు కోసం సైరన్లు మళ్లీ వినిపిస్తాయి. మాక్ డ్రిల్ ముగింపు ప్రకటిస్తారు. ప్రజలందరూ డ్రిల్‌లో పాల్గొన్న ప్రభుత్వ శాఖలకు సహకరించాలి. ప్రభుత్వేతర మూలాల పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే అనుసరించాలి.

Exit mobile version