Operation Abhyas: అత్యవసర పరిస్థితుల్లో ప్రజల చొరవ, సహాయక సంస్థల సమన్వయం ఎంతో అవసరం. దీనికోసం ప్రభుత్వం తరచూ నిర్వహించే విధానాలే మాక్ డ్రిల్స్. అంటే,అనుకోని ప్రమాదాలు, ఉగ్రదాడులు, సహజ విపత్తులు వంటి సందర్భాల్లో ఎలా స్పందించాలి, ఎవరెవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల్లో ముందస్తుగా ప్రాక్టీస్ చేసే కార్యక్రమాలు. ఇందులో ప్రభుత్వ విభాగాలు, సహాయక బృందాలు, ప్రజలు కలిసి పాల్గొంటారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ…
పౌర రక్షణ బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన శత్రు దాడిలో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించేందుకు ప్రజలను సిద్ధం చేస్తోంది. పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పుడూ పౌర రక్షణ నిర్వహిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో స్పందించేందుకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంటాయి. పౌరులకు అవగాహన కల్పించి శిక్షణ ఇస్తాయి. పౌరుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు పని చేస్తాయి. శత్రు దాడి సమయంలో ప్రజల ధైర్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. ఈ మేరకు…