Citroen C3 Aircross Dhoni Edition Price and Bookings: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘సిట్రోయెన్’కు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వరుసగా కార్లను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో సిట్రోయెన్ ఇండియా సీ3 ఎయిర్‌క్రాస్ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిని ‘ధోనీ ఎడిషన్’ పేరుతో తీసుకొచ్చింది. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గౌరవార్ధం ఈ ఎడిషన్‌ను విడుదల చేసింది. అయితే ఈ స్పెషల్ వేరియంట్ కారును కంపెనీ 100 మందికి మాత్రమే పరిమితం చేసింది.
సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ ప్రారంభ ధర రూ.11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఈ ఎడిషన్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. ధోనీ ఎడిషన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. సూపర్ డిజైన్ కలిగిన ఈ కారు.. స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఎంఎస్ ధోనీ పేరు, 7 నెంబర్ వంటివి అదనంగా ఉండటం చూడవచ్చు.
Also Read: IND vs BAN: నేడు బంగ్లాతో సూపర్-8 మ్యాచ్.. సెమీస్‌పై భారత్ కన్ను!
సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్‌లో కుషన్ పిల్లో, సీట్ బెల్ట్ కుషన్‌లు, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ ప్లేట్లు, ఫ్రంట్ డాష్ కెమెరా వంటివి ఉంటాయి. ఈ కారును కొనుగోలు చేసేవారు మహీ సంతకం చేసిన ‘గ్లౌస్’ పొందవచ్చు. ఇది 1.2 లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. ఇది 110bhp మరియు 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ కలిగి ఉంది.