CAA: అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ నేటి నుంచి అమలులోకి రాబోతుందంటూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం 1955కి 2019లో కేంద్రం సవరణ చేసిన సంగతి తెలిసిందే. 2016లో పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. 2019లో ఆమోదం పొందిన బిల్లుకు.. ఇప్పటివరకు కేంద్రం నిబంధనలను ప్రకటించలేదు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో సీఏఏను ప్రతిపాదించింది. 2019లో కేంద్రం చట్టం చేసింది.. ఇప్పుడు అమలు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.
Read Also: Big Breaking: కేంద్రం సంచలన నిర్ణయం.. సీఏఏ చట్టం అమలుకు నేడే నోటిఫినేషన్!
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
లోక్‌సభ ఎన్నికల ముందే ఈ చట్టం తీసుకొస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ విభజన జరిగినప్పుడు పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న మైనారిటీల కోసం కాంగ్రెస్ పార్టీ పౌరసత్వం కల్పిస్తామన్న వాగ్దానం చేసింది.. కానీ అమలు చేయలేదు, చట్టం తీసుకురాలేదని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌లలో హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం మంజూరు చేయడానికి ఉద్దేశించిన చట్టమే పౌరసత్వ సవరణ చట్టం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం అనుమతించినుంది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు మూడు దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు బౌద్ధులు, పార్శీలకు ఈ పౌరసత్వ సవరణ చట్టం వర్తించనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!