Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా లక్నోలో జరిగిన తొలి మ్యాచ్‌లో 15 ఏళ్ల ఈ కుర్రాడికి తుది జట్టు (ప్లేయింగ్-11)లో చోటు దక్కలేదు. శుక్రవారం రాంచీ వేదికగా జరగబోయే రెండో టీ20లో కూడా అతనికి అవకాశం రావడం కాస్త కష్టమే అనిపిస్తోంది. అయినప్పటికీ మ్యాచ్‌కి ముందు రాంచీ నెట్స్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. ఒకదాని వెనుక ఒకటి భారీ షాట్లు కొడుతూ బంతిని డిస్టాన్స్ స్టాండ్స్‌లోకి పంపించడంతో అందరి చూపు అతడి వైపే మళ్లింది.
వైభవ్ ఆడుతున్న తీరు చూసి అక్కడ ఉన్న పోలీసులు, మీడియా ప్రతినిధులు సైతం నెట్స్ చుట్టూ చేరిపోయారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కన్ను రెప్ప వేయకుండా అతని బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ఆసక్తిగా గమనిస్తూ ఉండిపోయాడు. తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘనవిజయం సాధించినప్పటికీ, ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో రెండో మ్యాచ్‌లో టాప్ ఆర్డర్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనే చర్చ మొదలైంది. నెట్స్‌లో వైభవ్ చూపిస్తున్న అగ్రెసివ్ బ్యాటింగ్ చూస్తుంటే.. ఒకవేళ టీమ్ మేనేజ్మెంట్ మార్పుల వైపు మొగ్గుపడితే అతని పేరును ఖచ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది.
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
మరోవైపు రెండో టీ20 ప్లేయింగ్-11 పై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందిస్తూ ఇంకా ఏదీ ఖరారు కాలేదని స్పష్టం చేశారు. “జట్టును ఇంకా ఫైనల్ చేయలేదు, స్క్వాడ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆడే అవకాశం ఉంది. ఎవరికి ఎంత అవకాశం ఉందో ఇప్పుడు చెప్పలేను” అని వ్యాఖ్యానించారు. దీంతో వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నెట్స్‌లో అతని ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, ఆఖరి నిర్ణయం మాత్రం టీమ్ మేనేజ్మెంట్ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌లో 2-0తో తమ ఆధిక్యాన్ని పెంచుకోవాలని పట్టుదలగా ఉంది.
Vaibhav Sooryavanshi only dealing in sixes during practice session today at JSCA stadium, Ranchi! ☠️🔥🏏
– Head Coach Gautam Gambhir watching & Vaibhav smashing. 🥵 https://t.co/2UmwKIIYKO
— Rohit Sharma Fan (@hitmanfanfollow) October 8, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!