Rules Change: నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో సహా మారేవి ఇవే..
- నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే
- ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో సహా మారేవి ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ నెల వచ్చేసింది. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా కొన్ని రూల్స్ మారనున్నాయి. సెప్టెంబర్‌లో, ఆధార్ కార్డ్ అప్‌డేట్, ఐటీఆర్, యూపీఎస్ క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, ప్రతి నెలలాగే, LPG గ్యాస్ ధరలు కూడా ప్రభావితం కావచ్చు. జెట్ ఇంధనం, CNG-PNG ధరలో మార్పు ఉండవచ్చు. ఈ మార్పులు సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరి నేటి నుంచి ఏవేం మారనున్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read:Lokah : కేరళలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న కొత్తలోక
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఐటీఆర్ దాఖలు
ఈసారి ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని జూలై 30 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. దీని కారణంగా పన్ను చెల్లింపుదారులకు రిటర్న్లు దాఖలు చేయడానికి అదనపు సమయం లభించింది. అయితే సెప్టెంబర్ 15 లోపు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు నోటీసు రావచ్చు.
యూపీఎస్ గడువు
జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ఎంచుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఉంది. ముందుగా ఈ తేదీ జూన్ 30, కానీ తరువాత దానిని సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభించబడిన పెన్షన్ పథకం.
భారతీయ పోస్ట్ నియమాలు
పోస్ట్స్ డిపార్ట్మెంట్ (DOP) సెప్టెంబర్ 1, 2025 నుంచి దేశీయ పోస్టల్ సర్వీస్‌ను స్పీడ్ పోస్ట్ సర్వీస్‌తో విలీనం చేస్తోంది. అంటే ఇప్పుడు ఏదైనా సాధారణ పోస్ట్ ద్వారా కాకుండా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సెప్టెంబర్ 1 నుంచి దేశంలోని ఇండియా పోస్ట్ ద్వారా ఏదైనా రిజిస్టర్డ్ పోస్ట్ పంపితే, అది స్పీడ్ పోస్ట్ డెలివరీ అవుతుంది.
క్రెడిట్ కార్డ్ నియమాలు
SBI క్రెడిట్ కార్డ్ సెప్టెంబర్ 1, 2025 నుంచి ఎంపిక చేసిన కార్డుల నియమాలలో మార్పులను ప్రకటించింది. కొన్ని కార్డులకు రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌ను సవరించింది. ఈ సవరణతో, అటువంటి కార్డులను కలిగి ఉన్న కస్టమర్‌లు డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో లావాదేవీలకు సంబంధించిన ఖర్చులపై రివార్డ్ పాయింట్లను సంపాదించలేరు.
ప్రత్యేక FD పథకాలు
ఇండియన్ బ్యాంక్, IDBI బ్యాంక్ వంటి బ్యాంకులు ప్రస్తుతం కొన్ని ప్రత్యేక కాలపరిమితి FDలను నిర్వహిస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్, 444-రోజుల, 555-రోజుల పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2025. అదేవిధంగా, IDBI బ్యాంక్ 444-రోజుల, 555-రోజుల, 700-రోజుల ప్రత్యేక FDలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ కూడా సెప్టెంబర్ 30.
Also Read:Trump: అలాగైతే అమెరికా నాశనమే.. టారిఫ్ తీర్పుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
LPG సిలిండర్ ధర
ప్రతి నెల లాగే, సెప్టెంబర్ 1 నుంచి LPG సిలిండర్ ధర కూడా మారవచ్చు. గత కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధర మారుతూ వస్తోంది. గత నెల కూడా వాణిజ్య సిలిండర్ల ధర మారింది. ఆగస్టులో, వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 33.50 తగ్గింది. చమురు కంపెనీలు LPG తో పాటు CNG, PNG, జెట్ ఇంధనం (AFT) ధరలను మారుస్తాయి. సెప్టెంబర్ నెల నుంచి వాటి ధరలు కూడా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!