ముంబై నటి జత్వానీ కాదంబరి కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆదివారం ఉదయం పీఎస్‌ఆర్‌ను సీఐడీ కస్డడీకి తీసుకుంది. విజయవాడ జీజీహెచ్‌లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు పీఎస్‌ఆర్‌ను విచారించనున్నారు. నటి జత్వానీ కాదంబరి వేధింపుల కేసులో ఆయన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read: AP News: మదనపల్లెలో ఐదు మంది పాకిస్థానీయుల గుర్తింపు!
నటి జత్వానీ కాదంబరిని వేధించారనే ఆరోపణల నేపథ్యంలో పీఎస్‌ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని నివాసం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని.. విజయవాడకు తరలించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పీఎస్‌ఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపర్చారు. జడ్జి ముందు పీఎస్‌ఆర్ తన వాదనలు తానే వినిపించుకున్నారు. ఆపై విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. కోర్టు అనుమతించడంతో సీఐడీ అధికారులు ఈరోజు ఆయనను కస్డడీకి తీసుకున్నారు.