ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ హెచ్చు తగ్గులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎకో తీయించడంతో గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండె జబ్బులకు సంబంధించి స్పెషల్ వార్డులో పీఎస్సార్ ఆంజనేయులును ఉంచారు. ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.
పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుందని.. కస్టోడియల్ టార్చర్ కి ఏపీ పోలీస్ స్టేషన్ లు వేదికలుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. గతంలో సోనియాతో కలసి జగన్ ను 16 నెలలు జైలులో ఉంచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.. లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. లేని లిక్కర్ కేసు సృష్టించారని విమర్శించారు.
ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదైన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. ఈ అక్రమాల్లో మరింత మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్సార్, ఏ2గా క్యామ్ సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్ లో ఏపీపీఎస్సీ కమిషన్ వింగ్ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాత్రను ప్రస్తావించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ చెప్పిన పనులను వెంకట సుబ్బయ్య చక్కబెట్టినట్టు…
విజయవాడ జిల్లా జైల్లో తనకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని కోర్టుకి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు తెలిపారు. పూజకు పుస్తకాలు, పెట్టుకోవటానికి బొట్టు ఇవ్వటం లేదని జడ్జికి చెప్పారు. తాను విచారణకు సహకరిస్తున్నారని, మరోసారి కస్టడీకి తీసుకున్నా సహకరిస్తానన్నారు. జైల్లో తాను వెళ్లిన తర్వాత తన కారణంగా వేరే వారికి కూడా సౌకర్యాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జైలుకి వెళ్లిన తొలి రోజున టీవీ ఉందని, వాకింగ్ వెళ్లి…
ముంబై నటి జత్వానీ కాదంబరి కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆదివారం ఉదయం పీఎస్‌ఆర్‌ను సీఐడీ కస్డడీకి తీసుకుంది. విజయవాడ జీజీహెచ్‌లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు పీఎస్‌ఆర్‌ను విచారించనున్నారు. నటి జత్వానీ కాదంబరి వేధింపుల కేసులో ఆయన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. Also Read: AP News: మదనపల్లెలో ఐదు మంది పాకిస్థానీయుల…
ముంబై నటి జత్వానీ కాదంబరి కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును బుధవారం ఉదయం జడ్జి ముందు సీఐడీ ప్రవేశపెట్టింది. రిమాండ్ కోసం వాదనలు జరిగ్గా.. జడ్జి ముందు పీఎస్‌ఆర్ తన వాదనలు తానే వినిపించుకున్నారు. జత్వాన్ని కేసులో ఏం జరిగిందన్న అంశాలను జడ్జికి పీఎస్ఆర్ వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని పీఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. మాజీ డీసీపీ విశాల్…