Inner Ring Road case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సీఐడీ మరింత దూకుడు చూపిస్తోంది.. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేసింది సీఐడీ.. ఈ రోజు సిట్ ముందు విచారణకు హాజరుకాబోతున్నారు లోకేస్.. ఇదే సమయంలో.. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి నారాయణ అల్లుడికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 11న విచారణకు రావాలని నారాయణ అల్లుడు పునీత్ కి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది సీఐడీ.. అయితే, సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పునీత్.. ఈ రోజు ఏపీ హైకోర్టు ఆ పిటిషన్‌పై విచారణ జరపనుంది. కాగా, ఈ రోజు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు నారా లోకేష్.. ఉదయం 10 గంటలకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ని ఏపీ సీఐడీ ప్రశ్నించనుంది.. ఈ కేసులో లోకేష్‌ను ఏ-14గా పేర్కొంది సీఐడీ.. అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో లోకేష్‌ని విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
Read Also: Karnataka : ఘోర ప్రమాదం..రెండు లారీల మధ్య నుజ్జునుజ్జయిన కారు.. ఏడుగురు మృతి..